logo

నేడు కలికిరికి సీఎం జగన్‌ రాక

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రం కలికిరికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలికిరి-కలకడ మార్గంలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న స్థలాన్ని హెలీప్యాడ్‌కు పరిశీలించి చదును చేశారు.

Published : 30 Apr 2024 06:34 IST

కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రం కలికిరికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలికిరి-కలకడ మార్గంలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న స్థలాన్ని హెలీప్యాడ్‌కు పరిశీలించి చదును చేశారు. ఈ స్థలం హెలీకాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో సైనిక పాఠశాల మైదానంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేపట్టారు. ఈ సందర్భంగా ఏడుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 40 మంది ఎస్‌.ఐ.లు, 400 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో మదనపల్లె నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలను వాల్మీకిపురం నుంచి సాకిరేవుపల్లె-మేడికుర్తి క్రాస్‌ మీదుగా మళ్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని