logo

రోడ్డుపైనే సీఎం సభ... ప్రయాణాలు మానుకోండి!

ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల వైపు నుంచి మైదుకూరు మీదుగా బద్వేలు, కడప మార్గంలో మంగళవారం రాకపోకలు సాగించే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచార సభను మైదుకూరు వద్ద కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై నిర్వహించనున్నారు.

Published : 30 Apr 2024 06:40 IST

నేడు మైదుకూరు రానున్న సీఎం జగన్‌
జాతీయ రహదారి పూర్తిగా మూసివేత
ఈనాడు, కడప

మైదుకూరులో హెలీప్యాడ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్‌, తదితరులు

ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల వైపు నుంచి మైదుకూరు మీదుగా బద్వేలు, కడప మార్గంలో మంగళవారం రాకపోకలు సాగించే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచార సభను మైదుకూరు వద్ద కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై నిర్వహించనున్నారు. జాతీయ రహదారిపైనే సభ ఏర్పాట్లు చేస్తున్నందున మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిపి వేయనున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు. ప్రొద్దుటూరు నుంచి కడపకు రావాలన్నా.. బద్వేలు వైపు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పేలా లేవు. కర్నూలు-కడప జాతీయ రహదారి వంతెనకు సమీపంలో మైదుకూరు వైపుగా ఉన్న జాతీయ రహదారిపైనే సభ నిర్వహించనున్నారు. దీంతో పోరుమామిళ్ల నుంచి మైదుకూరు రావాల్సిన వాహనాలకు అంతరాయం కలగనుంది. ఉదయం నుంచి సభ పూర్తయిన అనంతరం గంట వరకు రాకపోకలు స్తంభించే అవకాశం ఉంది. అసలే భగభగ మండే ఎండలు కాస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక పోవచ్చు. ఇతర వాహనాల్లో ప్రయాణించినా ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులతో ప్రయాణించేవారు మరింత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ సభ ఉంటుందని పార్టీ నుంచి సంకేతాలొచ్చాయి. సమయానికి వచ్చే పక్షంలో గంట పాటు సభ నడవచ్చు. సమయం మేరకు సీఎం పర్యటన సాగే పక్షంలో మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ట్రాఫిక్‌ పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలోనూ గంట పాటన్నా.. స్తంభించిన వాహనాల రాకపోకలకు సమయం పట్టే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని