logo

సీఎం పర్యటనతో విభాజికం ధ్వంసం

ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు విస్తుపోయే పరిస్థితి. ఇది ఒక్ల మైదుకూరు పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంత వాసులకు ఎదురయ్యే దుస్థితి.

Published : 30 Apr 2024 06:41 IST

విభాజకం ధ్వంసం చేసిన ప్రాంతం

మైదుకూరు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు విస్తుపోయే పరిస్థితి. ఇది ఒక్ల మైదుకూరు పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంత వాసులకు ఎదురయ్యే దుస్థితి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం మైదుకూరు రానున్న నేపథ్యంలో ప్రొద్దుటూరురోడ్డులో బహిరంగసభ నిర్వహించునున్నారు. హెలిప్యాడ్‌ నుంచి బస్సులో చేరుకునే సీఎం ప్రసంగం అనంతరం వెనుతిరగాల్సి ఉంది. అందుకోసం జాతీయ రహదారి విభాజికానికి రెండుచోట్ల పది అడుగుల చొప్పున ధ్వంసం చేశారు. తిరిగి ఆ ప్రాంతానికి సిమెంట్‌తో ప్లాస్టరింగ్‌ చేయిస్తున్నారు. అంతేకాదు ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన విభాజికం మధ్యతో ఎర్రమట్టిని నింపి అందంగా ఉండేలా చేస్తున్నారు. సీఎం ఏ ప్రాంతానికి వెళ్లినా చెట్లను నరకడం, అడ్డువచ్చిన వాటిని తొలగించడాన్ని చూస్తున్న ప్రజలు పట్టణంలో విభాజకం కొంత భాగాన్ని ధ్వంసం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

సిమెంట్‌ పూస్తున్న కూలీలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని