logo

కడపలో వైకాపా అరాచకం

కడప నగరంలో వైకాపా అరాచకాలు ముదిరి పాకానపడుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నగరంలోని 41వ డివిజన్‌లో శనివారం తెదేపా ప్రచారాన్ని డిప్యూటీ మేయర్‌ భర్త జమాల్‌తో పాటు పలువురు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Published : 05 May 2024 05:11 IST

తెదేపా ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం

తెదేపా ప్రచారంలోకి దూసుకువస్తున్న వైకాపా కార్యకర్తలు

ఈనాడు, కడప: కడప నగరంలో వైకాపా అరాచకాలు ముదిరి పాకానపడుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నగరంలోని 41వ డివిజన్‌లో శనివారం తెదేపా ప్రచారాన్ని డిప్యూటీ మేయర్‌ భర్త జమాల్‌తో పాటు పలువురు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ ప్రాంతంలోకి ప్రచారానికి రాకూడదంటూ గొడవకు దిగారు. నేతలు, కార్యకర్తలపైకి దూసుకొచ్చారు. విషయం తెలిసి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైకాపా అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, రానున్న రోజుల్లో రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాను ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని