logo

పోస్టల్‌ బ్యాలెట్‌కు పోటెత్తిన ఓటర్లు

జిల్లాలో తొలి రోజు ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఉద్యోగులు పోటెత్తారు. ఉదయం 8 గంటల నుంచే నియోజకవర్గ కేంద్రాల్లో వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

Updated : 06 May 2024 06:51 IST

జిల్లాలో తొలి రోజు 71.10 శాతం నమోదు

రాయచోటి డైట్‌ కేంద్రంలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో తొలి రోజు ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఉద్యోగులు పోటెత్తారు. ఉదయం 8 గంటల నుంచే నియోజకవర్గ కేంద్రాల్లో వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. క్యూలైన్లలో నిలబడి ఓటేసేందుకు ఎండలను సైతం లెక్క చేయలేదు. మధ్యాహ్నం ఒంటి గంటకే 28.49 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ ముగిసే సమయానికి 71.10 శాతం ఓట్లు నమోదయ్యాయి. సాయంత్రం 6 గంటల సమయానికి పోలింగ్‌ కేంద్రాల్లో వరుసలో నిల్చున్న ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సరళిని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పరిశీలించారు. రాయచోటి నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకే 84.18 శాతం ఓట్లు పోలవగా, రాజంపేటలో అత్యధికంగా 89.59 శాతం పోలింగ్‌ పూర్తయింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అత్యల్పంగా 66.36 శాతం ఓట్లు పోలయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లోని ఆయా పార్టీల అభ్యర్థులు కేంద్రాల వద్దకొచ్చి పోలింగ్‌ తీరుని పరిశీలించారు.

8వ తేదీ వరకు అవకాశం : ఎన్నికల విధుల్లో ఉండి ఫారం 12ను సమర్పించలేకపోయిన ఉద్యోగులకు ఈ నెల 7, 8 తేదీలలో పోస్టల్‌ బ్యాలెట్‌కు మరో అవకాశం ఇస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిశోర్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు. మే 1వ తేదీ కంటే ముందు ఫారం 12ను సమర్పించలేకపోయిన వారికి మరోసారి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. 7, 8 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని వారి స్థానిక నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన పెసిలిటేషన్‌ కేంద్రాలలో ఫారం 12తో పాటు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ను ఆర్వోకు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని