logo

పోలీసులపై ఎమ్మెల్యే రాచమల్లు బావమరిది జులుం

ప్రొద్దుటూరు పట్టణంలోని అనిబిసెంట్‌ పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ కోసం ఆదివారం ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు సమీపంలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి, వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు బావమరిది పి.మునిరెడ్డి అలియాస్‌ బంగారురెడ్డి పలుదఫాలుగా పోలీసు అధికారులతో వాగ్వాదం చేశారు.

Published : 06 May 2024 04:13 IST

సీఐ వెంకటరమణతో  రాచమల్లు బావమరిది బంగారురెడ్డి వాగ్వాదం

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణంలోని అనిబిసెంట్‌ పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ కోసం ఆదివారం ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు సమీపంలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి, వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు బావమరిది పి.మునిరెడ్డి అలియాస్‌ బంగారురెడ్డి పలుదఫాలుగా పోలీసు అధికారులతో వాగ్వాదం చేశారు. 100 మీటర్ల పరిధిలో రెండ్లు బారికేడ్లు ఉన్న చోట్ల ఆయన పోలీసులపై జులుం ప్రదర్శించారు. తెదేపా నేత ఈవీ సుధాకర్‌రెడ్డిని పోలింగ్‌ కేంద్రం ఆవరణంలోకి పంపడంపై ఆయన ఆక్షేపించారు. లోపల కొంతమంది నాయకులున్నారని, వారిని పంపాక పంపిస్తామని సీఐ వెంకటరమణ బదులిచ్చారు. దీంతో తాను శాసనసభ అభ్యర్థిగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లవచ్చని, తనను ఆపరాదంటూ మండిపడుతూ పోలీసులను తోసేసి, పక్కకునెట్టేసి ముందుకువెళుతుండగా సీఐ నిలువరించే ప్రయత్నం చేస్తూ చివరకు ఆయనతో పాటు పోలింగ్‌ కేంద్రం వరకు వెళ్లారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, అయిదారుగురు తెదేపా నాయకులను ఏ విధంగా లోపలకు అనుమతిచ్చారని బంగారురెడ్డి ప్రశ్నించారు. వారిని అక్కడి నుంచి బయటకు పంపకపోతే ఘర్షణలకు దారితీస్తాయని హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులపై హల్‌చల్‌ చేస్తున్నా బంగారురెడ్డిని ఎందుకు కట్టడి చేయలేదని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. తన బావ వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుకు అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయన పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారని వారు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని