logo

అవినీతిరహిత పాలన భాజపా నినాదం

అవినీతి రహిత పాలన భాజపా నినాదమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో ఆదివారం నిర్వహించిన ఎన్‌డీఏ కూటమి ఎన్నికల ప్రచారసభ, విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 06 May 2024 04:23 IST

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

మాట్లాడుతున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పక్కన అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి

కొండాపురం, న్యూస్‌టుడే: అవినీతి రహిత పాలన భాజపా నినాదమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో ఆదివారం నిర్వహించిన ఎన్‌డీఏ కూటమి ఎన్నికల ప్రచారసభ, విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడిచిన పదేళ్లలో భాజపా మంత్రుల్లో ఏ ఒక్కరిపై ఆరోపణలు లేవన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని పీవీ నరసింహారావుకు సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే చెందుతున్నారు. కాంగ్రెస్‌ హయంలో మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. అత్యధిక పార్లమెంటు స్థానాలను ఎన్డీఏ కూటమి సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతిలో మోదీ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. గండికోట, రాజోలి నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గండికోటను పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలవుతాయన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని, జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని