logo

పట్టపగలు కాదు...అర్ధరాత్రి మెరుపుల వెలుగు

ఈ చిత్రం చూస్తే ఇదేదో పట్టపగలు తీసిందని అనుకుంటారు... కానీ చిమ్మచీకట్లో తీసిన చిత్రమిది... మెరుపు తీగలు నగరానికి నగలా మారగా ఆ వెలుగులు పట్టపగలును తలపించాయి.

Published : 08 May 2024 06:10 IST

ఈనాడు, కడప : ఈ చిత్రం చూస్తే ఇదేదో పట్టపగలు తీసిందని అనుకుంటారు... కానీ చిమ్మచీకట్లో తీసిన చిత్రమిది... మెరుపు తీగలు నగరానికి నగలా మారగా ఆ వెలుగులు పట్టపగలును తలపించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిప్పుల కుంపటిలా ఉన్న కడప నగరంపై వరుణుడు నీళ్లు చల్లాడు... ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గంటకు పైగా భారీ వర్షం నగరాన్ని తడిచి ముద్దయ్యేలా చేసింది. ఆలంఖాన్‌పల్లి వద్ద అర్ధరాత్రి 1 గంట సమయంలో తీసిన చిత్రమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని