logo

విస్తృతంగా చేరికలు... పెరిగిన వలసలు

ఎన్‌డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్‌డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

Published : 10 May 2024 03:24 IST

ఎన్‌డీఏలో చేరిన వారితో జమ్మలమడుగులో అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి

జమ్మలమడుగు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు వైద్యం, కలసపాడు, మైలవరం, న్యూస్‌టుడే: ఎన్‌డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్‌డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలోని 20 మంది ఆర్‌ఎంపీలు సైతం కలసి తమ మద్దతు తెలిపినట్లు ఆదినారాయణరెడ్డి తెలిపారు.

మిట్టమానుపల్లెకు చెందిన వైకాపా నాయకులతో ఎన్డీయే అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌

పోరుమామిళ్ల పట్టణంలోని బలిజకోట వీధికి చెందిన 10 కుటుంబాలు గురువారం తెదేపాలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి  ఆహ్వానించారు. అక్కల్‌రెడ్డిపల్లె నుంచి 10 కుటుంబాలు, ముసల్‌రెడ్డిపల్లె నుంచి 30 కుటుంబాలు మొత్తం 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగిరి భైరవప్రసాదు, సర్పంచి సుధాకర్‌, తెదేపా నాయకులు సీతా వెంకటస్బుయ్య, రామసుబ్బారావు, సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన 100 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారందరికీ మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి కండువాకప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. వరదరాజులురెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రొద్దుటూరులో అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలు అంతమవుతాయన్నారు. పెద్దముడియం మహమ్మద్‌బాషా, గైబు, షరీఫ్‌, బుజ్జి, ఇంద్ర, బాషా, అక్బర్‌, తదితరులు పాల్గొన్నారు. కలసపాడు మండలంలోని పుల్లారెడ్డిపల్లెలో తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ, జడ్పీట©సీ మాజీ సభ్యుడు డి.రాంభూపాల్‌రెడ్డి సమక్షంలో, స్థానిక నాయకుడు పెదిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 15 కుటుంబాలు తెదేపాలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. మైలవరం మండలం వేపరాల-1 ఎంపీటీసీ సభ్యులు అలిశెట్టి కుమార్‌, దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన యనమల సుబ్బిరెడ్డి, మైలవరానికి చెందిన భీముడు నాయక్‌లతో పాటు 200 కుటుంబాలు ఆదినారాయణరెడ్డి సమక్షంలో కూటమిలో చేరాయి. మైదుకూరు నియోజకవర్గంలో మిట్టమానుపల్లె పంచాయతీకి చెందిన సాంబశివారెడ్డి, నక్కా నారాయణతోపాటు వారి అనుచరులు ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో ఎన్డీయే అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు