logo

ఓటు వేసుకుంటాం... ఏజెంట్‌గా కూర్చుంటాం

ప్రజాస్వామ్యరీతిలో మాఓటు హక్కును వినియోగించుకుంటాం.. పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లుగా నియమించుకుంటాం.

Updated : 10 May 2024 05:26 IST

వైకాపా నాయకుల నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదు

కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు

మైదుకూరు, న్యూస్‌టుడే : ప్రజాస్వామ్యరీతిలో మాఓటు హక్కును వినియోగించుకుంటాం.. పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లుగా నియమించుకుంటాం. వైకాపా నాయకుల నుంచి మాకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం మైదుకూరు మండలం తువ్వపల్లె ఎసీˆ్సలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధాన అధికారితోపాటు జిల్లా, నియోజకవర్గ ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎసీˆ్సలు విలేకరులకు తెలిపారు. గురువారం కడప కలెక్టరేట్ చేరుకున్న తువ్వపల్లె ఎసీˆ్సలు ఎన్నికల ప్రధాన అధికారికి పంపిన ప్రతిని ప్రదర్శించారు. తువ్వపల్లె పోలింగ్‌ స్టేషన్‌ సంఖ్య 128 పరిధిలోని ఉప మండలాధ్యక్షుడు ఊటుకూరు రఘురామిరెడ్డి, గ్రామ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, గూడా వెంకటసుబ్బారెడ్డి, వేమన నరసింహారెడ్డి, ఎనమల మల్లికార్జునరెడ్డి, ఊటుకూరు రామాంజనేయరెడ్డి ఓటు వేయవద్దని, ఏజెంట్లుగా కూర్చోకూడదని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎసీˆ్సలమైన తమకు ఎన్నికల నిబంధనల మేరకు 128 పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు హక్కును సజావుగా వినియోగించుకునేందుకు, ఏజెంట్గా నియామకం కొరకు ఉత్తర్వులు జారీ చేసి పోలీసు సిబ్బందిని నియమించి ప్రాణహాని జరగకుండా భద్రత కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదులో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని