logo

చర్చలకు వెళ్లేదేలే

అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని, ఉద్యోగులకు ఈ నెల పాత వేతనాలు ఇవ్వాలని, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ మంత్రుల కమిటీకి లేఖ రాసినా.. ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని, ఇక మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేది లేదని, ప్రభుత్వం కూడా మొండిగా ముందుకెళుతోందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో గురువారం ఉద్యోగులు,

Published : 28 Jan 2022 02:08 IST

డీడీవోలు అత్యుత్సాహంతో బిల్లులు చేయడం తగదు

పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు

దీక్షలో కూర్చున్న వారికి దండలు వేస్తున్న పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు.

చిత్రంలో విద్యాసాగర్‌. ఖాసిం, పూర్ణచంద్రరావు, కొండలరావు తదితరులు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని, ఉద్యోగులకు ఈ నెల పాత వేతనాలు ఇవ్వాలని, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ మంత్రుల కమిటీకి లేఖ రాసినా.. ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని, ఇక మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేది లేదని, ప్రభుత్వం కూడా మొండిగా ముందుకెళుతోందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో గురువారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొత్త వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. కొందరు డీడీవోలు మాత్రం అత్యుత్సాహంతో బిల్లులు చేస్తున్నారని ఆరోపించారు. బిల్లులు చేయడం ఆపాలని కోరారు. పాత వేతనాలు ఇచ్చేలా ఆర్థిక శాఖాధికారులు సహకరించాలని కోరారు. పీఆర్సీ ఉద్యమంపై ఉద్యోగులపై ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయడానికి శాస్త్రీయత ఉందన్నారు. ప్రభుత్వం, అధికారులు హడావుడి చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఖాసిం, ఎన్జీవో నగర కార్యదర్శి పూర్ణచంద్రరావు, యూటీఎఫ్‌ నగర సహ అధ్యక్షుడు కొండలరావు తదితరులు హాజరయ్యారు.

రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని