logo

Charminar: తవ్వకాల్లో బయటపడిన చార్మినార్‌ భూగర్భ మెట్లు

చార్మినార్‌ కట్టడానికి పిడుగు ప్రమాదం లేకుండా పురాతత్వ సర్వేక్షణ విభాగం అధికారులు కొద్దిరోజులుగా చర్యలు చేపడుతున్నారు. నాలుగు మినార్లకు ఇత్తడి తీగలు ఏర్పాటు చేసి..

Updated : 16 Feb 2022 09:11 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: చార్మినార్‌ కట్టడానికి పిడుగు ప్రమాదం లేకుండా పురాతత్వ సర్వేక్షణ విభాగం అధికారులు కొద్దిరోజులుగా చర్యలు చేపడుతున్నారు. నాలుగు మినార్లకు ఇత్తడి తీగలు ఏర్పాటు చేసి.. వాటిని భూమికి అనుసంధానం చేయడం, జనరేటర్‌ ఏర్పాటుకు గానూ మంగళవారం తవ్వకాలు చేపట్టారు. గతంలో చార్మినార్‌ చుట్టూ రోడ్డు వేసే క్రమంలో భూమిలో కూరుకుపోయిన మెట్లు కొన్ని బయటపడ్డాయి. ఈ సమాచారం అందగానే పత్తర్‌గట్టీ కార్పొరేటర్‌ సోహెల్‌ఖాద్రీతో పాటు మజ్లిస్‌ నేతలు అక్కడికి చేరుకున్నారు. చార్మినార్‌ వద్ద ఎందుకు తవ్వకాలు చేపడుతున్నారని అధికారులను ప్రశ్నించారు. దీంతో పురాతత్వ సర్వేక్షణ విభాగం హైదరాబాద్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ స్మితా, చార్మినార్‌ కన్జర్వేటర్‌ రాజేశ్వరి అక్కడికి వచ్చి తవ్వకాలు చేపట్టడానికి గల కారణాలను కార్పొరేటర్‌కు వివరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని