Hyderabad: ప్రేమ వివాహం.. దీపావళి రోజే ఇంటి వెలుగును ఆర్పేశాడు
కులాలు వేరైనా ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనంతర కాలంలో ఆర్థిక సమస్యలకు తోడు భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
నేరేడ్మెట్, న్యూస్‌టుడే: కులాలు వేరైనా ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనంతర కాలంలో ఆర్థిక సమస్యలకు తోడు భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో దీపావళి రోజే ఇంటి వెలుగును ఆర్పేశాడు. నేరేడ్మెట్ సీఐ శివకుమార్, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన ఎ.స్రవంతి(22), సిద్ధిపేట జిల్లా గజ్వేల్ శ్రీగిరిపల్లికి చెందిన కారు డ్రైవర్ మహేందర్‌లు 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. వీరు ఏడాది క్రితం ఉప్పల్ పరిధిలోని జవహర్‌నగర్‌లోని కందిగూడలో ఉండగా.. మహేందర్ ఓకేసులో జైలుకెళ్లాడు. స్రవంతి భర్తను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చింది. అందుకయిన ఖర్చు విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అనంతరం వారు నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని సమతానగర్‌కు మారారు.
కుటుంబంలో ఆర్థిక సమస్యలు, గొడవలు చోటుచేసుకోవడంతో స్రవంతి చాలా రోజులుగా తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఆదివారం ఇళ్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం సమతానగర్‌లో అద్దె ఇంటికి వెళ్లి చూడగా భర్త తన వస్తువులు తీసుకొని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మహేందర్ స్రవంతి ముఖంపై, తలపై బలంగా కొట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె మెడకు చున్నీ చుట్టి ఈడ్చుకెళ్లి మంచం కింద దాచాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. చెల్లి, బావ ఏమైనా గొడవ పడుతున్నారా అని స్రవంతి అన్న ప్రశాంత్ ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానంతో తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడటంతో ఆమె మృతి చెంది ఉంది. పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
[ 18-06-2024]
మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. -
భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్
[ 18-06-2024]
భవారియా గ్యాంగ్ మరోసారి రాజధానిపై విరుచుకుపడింది. నగర శివార్లలో కిరాతకమైన ధార్ గ్యాంగ్ అలజడి రేపిన కొద్దిరోజుల్లోనే ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు శనివారం ఒకే రోజు నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు -
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం
[ 18-06-2024]
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీ హబ్ రోడ్లలో పోకిరీలు బరితెగించారు. వాహన రేసులు, విన్యాసాలతో హంగామా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను బైకులతో ఢీకొట్టేందుకు యత్నించారు. -
డీజే సిద్ధార్థ్ కేరాఫ్ కొకైన్
[ 18-06-2024]
టీఎస్ న్యాబ్ ఆకస్మిక డ్రగ్స్ తనిఖీల్లో ఇద్దరు వినియోగదారులు పట్టుబడ్డారు. నగరంలోని కొన్ని పబ్బుల్లో డీజేగా పనిచేసే బంజారాహిల్స్ శ్రీరామ్‌నగర్‌కు చెందిన సిద్ధార్థ్, మాదాపూర్‌కు చెందిన స్వరూప్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. -
చెత్త డబ్బా.. శుభ్రం చేసేదెవరబ్బా?
[ 18-06-2024]
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. -
అత్యవసర బృందాలు ఎక్కడ?
[ 18-06-2024]
వానాకాలంలో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అత్యవసర బృందాలు సిద్ధం చేశామని జలమండలి ఊదరగొడుతుంది. -
కోడ్ మాటున.. కట్టేశారు!
[ 18-06-2024]
కొందరు చిన్న బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి జీప్లస్ 2, 3 అనుమతులు తీసుకొని ఆరేడు అంతస్తులు నిర్మించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
జలమండలి ఈడీ మళ్లీ ఆయనేనా?
[ 18-06-2024]
పదవీ విరమణ చేసినా ఎనిమిదేళ్లగా అవే బాధ్యతల్లో కొనసాగుతున్న జలమండలి ఉన్నతాధికారి ఆయన. తాజాగా తొమ్మిదో సంవత్సరం పొడిగింపునకూ రంగం సిద్ధమైంది. -
నగరకంలొ కుండపోత వాన
[ 18-06-2024]
-
ఐటీ కారిడార్‌పై రెవెన్యూ నజర్
[ 18-06-2024]
ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. -
భూ పరిపాలనలో మార్పులు తీసుకురావాలి
[ 18-06-2024]
రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు కోరారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌కు సీఎం రేవంత్ అభినందన
[ 18-06-2024]
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు -
ప్రకృతిలో అడుగులు.. పక్షుల పాఠాలు
[ 18-06-2024]
సెలవొస్తే బద్ధకంగా నిద్రలేసే నగర ప్రజలకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఒక కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. -
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి
[ 18-06-2024]
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి బదిలీపై వస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగాయి. -
349 మంది పట్టుబడ్డారు
[ 18-06-2024]
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మందుబాబుల మత్తు వదిలించారు. శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటలు దాటే వరకు కమిషనరేట్‌లోని 14 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 349 మందిపై కేసు నమోదు చేశారు. -
మామూళ్ల కోసం అధికారుల పోట్లాట
[ 18-06-2024]
జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు ఆహార కల్తీని ప్రోత్సహిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదు. -
ఆర్తితో ప్రార్థన.. ప్రేమతో అభినందన
[ 18-06-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. -
నీరు.. చేనుకు చేరేదెలా..?
[ 18-06-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్‌పల్లి జలాశయం నుంచి 9,200 ఎకరాలకు 36.72 కి.మీ. పొడవుతో ఉన్న కుడి, ఎడమ కాలువల నుంచి సాగు నీరు అందాలి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీట్ వివాదంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారు?
-
ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
-
ఆల్‌టైమ్ గరిష్ఠాలకు సూచీలు.. 23,500 ఎగువన ముగిసిన నిఫ్టీ
-
పోలవరాన్ని జగన్ అధోగతి పాల్జేశారు: ఎమ్మెల్సీ అనురాధ
-
5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్‌లు.. భారత్ కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు
-
డిప్యూటీ సీఎం పవన్‌కు అమరావతిలో ఘనస్వాగతం