logo
Published : 30/11/2021 00:49 IST

ధాన్యం పూర్తిగా కొనేవరకు పోరాటం: కాంగ్రెస్‌


అంతారంలో రైతులతో మాట్లాడుతున్న వీహెచ్‌, రామ్మోహన్‌రెడ్డి

పరిగి, దోమ, పరిగి గ్రామీణ, కుల్కచర్ల గ్రామీణ: రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన తెరాస.. ధాన్యం కొనుగోలు చేయడంలో తాత్సారం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సోమవారం కల్లాల్లోకి కాంగ్రెస్‌ కార్యక్రమంలో పరిగి, దోమ, అంతారం, పుట్టాపహాడ్‌ గ్రామాల్లో రైతుల ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు సమయంలో మిల్లర్లకు సహాయం చేసే విధంగా ప్రభుత్వమే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వరి పంట కాకుండా ఇతర పంటలను సాగు చేసిన వారికి ప్రోత్సాహకంగా రూ.10వేలు ఇస్తోందన్నారు. ఇక్కడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చేనెల 3వ తేదీలోగా రైతు సమస్యలు తీరని పక్షంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌లో నాయకుల మధ్య మనస్పర్ధలు ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారంలో ఏకతాటిపై నిలిచి పోరాడతామన్నారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. మరోవైపు మిల్లర్లు కమీషన్లు అధికంగా తీసుకోవడంతో ఆర్థికంగా దెబ్బతింటున్నారని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు డి.అశోక్‌ పాల్గొన్నారు.

కుల్కచర్లలో...:  ధాన్యం ఎప్పుడు కొంటారని వీహెచ్‌.. డీసీఓతో ఫోన్లో మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. 20 రోజులుగా కల్లాలోనే ఉన్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయలు, బ్లాక్‌2 అధ్యక్షుడు భరత్‌, నాయకులు భీంరెడ్డి, రాములు, అంజిలయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని