icon icon icon
icon icon icon

ఏలూరు

ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది (Eluru Lok Sabha constituency) జనరల్‌ కేటగిరిలో ఉంది.

Published : 09 May 2024 14:44 IST

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం (ఎస్టీ), చింతలపూడి (ఎస్సీ), నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజక వర్గాలు దీని పరిధిలోకి వస్తాయి.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో 16.25 లక్షల మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 7.94 లక్షలు, మహిళలు 8.30 లక్షలు, ట్రాన్స్‌జెండర్లు 129 మంది ఉన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావుపై వైకాపా అభ్యర్థి కోటగిరి శ్రీధర్ గెలుపొందారు.

ఈసారి ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు వీళ్లే!

ప్రస్తుతం ఈ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పుట్టా మహేష్‌ యాదవ్‌, వైకాపా అభ్యర్థిగా కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను పోటీలో ఉన్నారు. పుట్టా మహేష్‌ యాదవ్‌... తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు. ఆయన తండ్రి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు. ఆయన ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఏలూరు నుంచి బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దించాలన్న ఉద్దేశంతో మహేష్‌ యాదవ్‌కు పార్టీ అవకాశమిచ్చింది. మరోవైపు వైకాపా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌కు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది.  సునీల్‌ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం విశేషం. ఇక కాంగ్రెస్‌ నుంచి జంగారెడ్డిగూడేనికి చెందిన కావూరి లావణ్య పోటీ చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ అయిన ఆమె, ఇటీవల కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకుని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

  • గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 1952: బి.సూర్యనారాయణ మూర్తి (సీపీఐ)
  • 1957:  మోతె వేద కుమారి (సీపీఐ)
  • 1962: వి.విమల దేవి (కాంగ్రెస్‌)
  • 1967: కొమ్మారెడ్డి సూర్యనారాయణ (కాంగ్రెస్‌)
  • 1971: కొమ్మారెడ్డి సూర్యనారాయణ (కాంగ్రెస్‌)
  • 1977: కొమ్మారెడ్డి సూర్యనారాయణ (కాంగ్రెస్‌)
  • 1980: చిత్తూరి సుబ్బారావు చౌదరి (కాంగ్రెస్‌)
  • 1984: బోళ్ల బుల్లిరామయ్య ( తెదేపా)
  • 1989: ఘట్టమనేని కృష్ణ ( కాంగ్రెస్‌)
  • 1991: బోళ్ల బుల్లిరామయ్య (తెదేపా)
  • 1996: బోళ్ల బుల్లిరామయ్య (తెదేపా)
  • 1998: మాగంటి వెంకటేశ్వరరావు (కాంగ్రెస్‌)
  • 1999: బోళ్ల బుల్లిరామయ్య (తెదేపా)
  • 2004: కావూరి సాంబశివ రావు (కాంగ్రెస్‌)
  • 2009: కావూరి సాంబశివ రావు (కాంగ్రెస్‌)
  • 2014: మాగంటి వెంకటేశ్వరరావు (తెదేపా)
  • 2019: కోటగిరి శ్రీధర్‌ (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img