icon icon icon
icon icon icon

AAP: దిల్లీ ప్రజలు భాజపాకు ఓటుతో సమాధానం చెప్తారు: ఆప్

తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్‌ దిల్లీలో వాకథాన్‌ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆప్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Published : 05 May 2024 23:17 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రజల్లో ఉన్న మద్దతును తెలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దేశ రాజధానిలో వాకథాన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ సంజయ్ సింగ్, మంత్రి గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. ‘‘ప్రజాస్వామ్యయుతంగా, భారీ మెజారిటీతో ఎన్నికైన ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి ఆధారాలు, ఎఫ్‌ఐఆర్‌ లేకుండా అరెస్టు చేయించింది. రాజకీయ కారణాలతోనే ఈ విధంగా చేశారు. కేంద్రం తీరును దిల్లీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు ఓట్లతో తగిన సమాధానం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు’’అని గోపాల్ రాయ్ అన్నారు.

‘‘మీ పిల్లల చదువులు, ఆరోగ్యం, విద్యుత్‌, నీళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం కేజ్రీవాల్‌ అహోరాత్రులు శ్రమించారు. అటువంటి ఆయనను మోదీ ఓ క్రిమినల్‌లా చూస్తున్నారు. మన సీఎంను జైల్లో వేసినందుకు ఓటుతో సమాధానం చెబుదాం ’’అని సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img