icon icon icon
icon icon icon

LS polls: పోలింగ్‌ కేంద్రాలకు ‘ర్యాపిడో’ ఫ్రీ రైడ్‌.. హైదరాబాద్‌ సహా నాలుగు నగరాల్లో!

మే 13 పోలింగ్‌ రోజున.. ఓటర్లను ఉచితంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తామని రైడ్‌ షేరింగ్‌ యాప్‌ ‘ర్యాపిడో’ ప్రకటించింది.

Published : 06 May 2024 19:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) జరుగుతోన్న వేళ.. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘంతో పాటు స్వచ్ఛంద, ప్రైవేటుసంస్థలు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రైడ్‌ షేరింగ్‌ యాప్‌ ‘ర్యాపిడో’ Rapido).. రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా ఓటర్లను ఉచితంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించింది. మే 13న జరిగే పోలింగ్‌ రోజున.. హైదరాబాద్‌ సహా కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ నగరాల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనుంది.

33 ఏళ్లుగా రాజకీయ వైరం.. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్యే పోటీ!

పోలింగ్‌ రోజున ఓటర్లు ‘ర్యాపిడో’ యాప్‌లో 'VOTE NOW' కోడ్‌ను వినియోగించి ఫ్రీ రైడ్‌ను పొందవచ్చని సదరు సంస్థ వెల్లడించింది. ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ సేవలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని.. ఇందుకోసం 10 లక్షల మంది కెప్టెన్లను అందుబాటులో ఉంచనున్నామని తెలిపింది. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే క్రమంలో రవాణా విషయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లు తమ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో ర్యాపిడో సంస్థ నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img