icon icon icon
icon icon icon

Vinod Kumar: నేను గెలిస్తే కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలుమార్గం: భారాస అభ్యర్థి వినోద్‌ కుమార్‌

ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్‌కు తేవాలనేది తన లక్ష్యమని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ అన్నారు.

Updated : 04 May 2024 13:08 IST

కరీంగనగర్‌: ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్‌కు తేవాలనేది తన లక్ష్యమని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను నగరానికి తీసుకొస్తానని తెలిపారు. సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. విద్యాసంస్థ కోసం 150 ఎకరాల భూమిని కూడా గతంలో గుర్తించినట్లు వివరించారు. ఎంపీగా గెలిస్తే కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలుమార్గం వేసేందుకు కృషి చేస్తానన్నారు. 

‘‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదు. కరెంట్‌ సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. ఇళ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారు. కరీంనగర్‌కు బండి సంజయ్‌ ఏం చేశారో చెప్పాలి. ఇక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారా.. విధ్వంసం కోరుకుంటారా? కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి కోసం ఆలోచించింది నేనే. మోదీ పదేళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి’’ అని వినోద్‌కుమార్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img