Loose Hair: అందుకే జుట్టు లూస్‌గా వదిలేయొద్దనేది!
అమ్మాయిలు జుట్టు వదులుగా ఉంచుకోవడమేనది ఎప్పటి నుంచో ఒక ఫ్యాషన్‌గా మారింది. ఫ్యాషన్ మనకు అందాన్ని తీసుకొస్తే బాగానే ఉంటుంది అదే ప్రమాదానికి గురి చేస్తే... సరిగ్గా ఇలా ఉంటుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయిలు జుట్టు వదులుగా ఉంచుకోవడమేనది ఎప్పటి నుంచో ఒక ఫ్యాషన్‌గా మారింది. ఫ్యాషన్ మనకు అందాన్ని తీసుకొస్తే బాగానే ఉంటుంది అదే ప్రమాదానికి గురి చేస్తే... సరిగ్గా ఇలా ఉంటుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పేరు నికోల్ రిచి. అమెరికాలో ఫేమస్ టీవీ సెలబ్రెటీ, ఫ్యాషన్ డిజైనర్, నటి. తన 40వ పుట్టినరోజు వేడుకులు జరుపుకొనేందుకు గ్రాండ్‌గా సిద్ధమైంది. కేకు కోసే సమయంలో తన హెయిర్ కాస్త వెలుగుతున్న కొవ్వొత్తులపై పడి కాలిపోయింది. దీంతో భయంతో కేకలు వేసిందామె. ఇక పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ ఉన్నవారంతా నానా తిప్పలు పడ్డారు. కాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోను పంచుకున్నారామె. కామెంట్ సెక్షన్లో నికోల్ భర్త జోయెల్.. ‘‘నువ్వు చాలా హాట్’’ అంటూ ఫన్నీగా స్పందించారు. కొవ్వొత్తులు ఊదేటప్పుడు అలాగే దీపావళి రోజు నాడు అమ్మాయిలు జట్టు వదులుగా ఉంచుకోకుండా ఉంటే.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెబుతున్నారు నెటిజన్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!