TS: రెండోసారి తగ్గిన కరోనా పరీక్షల ధరలు

తెలంగాణలో నిర్వహించే కరోనా పరీక్షల ధరలను రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి సవరించింది. ల్యాబ్‌కు వెళ్లి చేసుకొనే కొవిడ్‌ పరీక్షలు, ఇంటి వద్ద చేసే కరోనా పరీక్షల ధరల్లో మరోసారి మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పరీక్షల ధరను మొదటిసారి సవరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ల్యాబ్‌ల్లో చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.850, ఇంటి..

Published : 23 Dec 2020 02:10 IST

హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించే కరోనా పరీక్షల ధరలను రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి సవరించింది. ల్యాబ్‌కు వెళ్లి చేసుకునే కొవిడ్‌ పరీక్షలు, ఇంటి వద్ద చేసే కరోనా పరీక్షల ధరల్లో మరోసారి మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పరీక్షల ధరను మొదటిసారి సవరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ల్యాబ్‌ల్లో చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.850, ఇంటి వద్ద చేసే వాటికి రూ.1,200గా నిర్ణయించింది. తాజాగా రెండో సారి సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్‌ల్లో చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధరను రూ.500, ఇంటి వద్ద చేసే కొవిడ్‌ టెస్టు ధరను రూ.750గా నిర్ణయించింది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్‌ టెస్టు కిట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నందున మరోసారి కొవిడ్‌ టెస్టు ధరలను తగ్గించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఇవీ చదవండి..

‘స్ట్రెయిన్‌’పై అప్రమత్తంగా ఉన్నాం: డా.శ్రీనివాస్‌

‘కరోనా కొత్త రకం’ భారత్‌లో లేదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని