నీటిలో మొసలా.. నాకేం భయం?

నీటిలో ఉన్నపుడు ఓ పెద్ద మొసలి నోరు తెరచుకుని మన వద్దకు వస్తే ఏం చేస్తాం?

Published : 19 Sep 2020 00:29 IST

వైరలవుతున్న సాహసికుడి వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం నీటిలో ఉన్నపుడు ఓ పెద్ద మొసలి నోరు తెరుచుకుని మన వద్దకు వస్తే ఏం చేస్తాం? బతుకు జీవుడా.. అంటూ పరిగెడతాం. అసలు ఆ దృశ్యాన్ని చూస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. కానీ మాట్‌ రైట్‌ అనే ఓ సాహసికుడు అలా చేయలేదు. మొసలిని మచ్చిక చేసుకుంటూ ఆ తర్వాత తన చేతితో మెల్లగా నెట్టేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తీసి.. దానిని సామాజిక మాధ్యమాల్లో కూడా ఉంచాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఆస్ట్రేలియాకు చెందిన మాట్‌ రైట్‌, మరో వ్యక్తితో కలసి అక్కడి ఓ నది ప్రవాహానికి అడ్డంగా ఉన్న కర్ర దుంగలను తొలగించే పనిలో ఉన్నాడు. ఈలోగా 13 అడుగుల పొడవున్న ఓ భారీ మొసలి అక్కడికి వచ్చింది. మాట్‌ ఏ మాత్రం భయపడకుండా సిట్‌.. (కూర్చో), స్టే (ఉండు) గో అవే.. (వెళ్లిపో) అంటూ దానితో మాట్లాడాడు. అనంతరం దాన్ని వెళ్లిపోమంటూ చేతితో ముందుకు నెట్టాడు. ఇక ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. వారిలో కొందరు.. ‘‘ఏంటి అతను కుక్క పిల్లతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు!’’ అని ఆశ్చర్యపోయారు. అయితే ‘బోన్‌క్రంచర్‌’ అనే పేరున్న ఈ మొసలి తనకు చాలా సంవత్సరాలుగా ‘తెలుసని’.. అది చాలా ‘ప్రశాంతంగా’ ఉంటుందని మాట్‌ రైట్‌ చెప్పటం విశేషం. అయితే, ఎవరూ తనలా అనుకరించవద్దని కూడా అతను హెచ్చరించాడు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని