రోడ్ల కోసం రోజుకు 2 గంటలు!

అతడో ఆటో డ్రైవర్‌. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆలోచించకుండా నలుగురికీ ఉపయోగకరమైన పని చేసేందుకు నడుం కట్టాడు. అధికారుల తీరుతో విసుగు చెంది గుంతలు పడిన రోడ్డును బాగు చేస్తున్నాడు.

Published : 29 Oct 2020 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడో ఆటో డ్రైవర్‌. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆలోచించకుండా నలుగురికీ ఉపయోగకరమైన పని చేసేందుకు నడుం కట్టాడు. అధికారుల తీరుతో విసుగు చెంది గుంతలు పడిన రోడ్డును బాగు చేస్తున్నాడు. సేవా గుణంతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడే శ్రీనివాస్‌రెడ్డి.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో శ్రీనివాస్‌రెడ్డి ఆటోడ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాసన్‌ వల్లీ రోడ్డులో ఆయన ఆటో నడుపుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రధాన రహదారిని కలిపే ఈ రోడ్డుపై భారీ వాహనాలూ తిరుగుతుంటాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రోడ్ల దుస్థితి గురించి గ్రామస్థులతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్‌ రెడ్డి. గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారికి వివరించారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో విసుగు చెందిన ఆయన ఎవరి సహాయం లేకుండా రహదారిని కొంచెం కొంచెంగా బాగుచేస్తున్నారు. తన పని చేసుకుంటూనే రహదారి మరమ్మతుల కోసం రెండు గంటలు కేటాయిస్తున్నారు. కాసన్‌ వల్లీ లోనే కాదు కోలార్‌ జిల్లా వ్యాప్తంగానూ ఇలాంటి రోడ్లే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు స్పందించక పోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు... శ్రీనివాస్‌ రెడ్డి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని