మంచు దుప్పటి కప్పుకొన్న తిరుమల గిరులు

భక్తిగీతాలు, వేద పారాయణాలతో తెల్లవారే తిరుమలలో శీతల సోయగాలు కనువిందు చేస్తున్నాయి. నివర్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఏడుకొండలు ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Published : 29 Nov 2020 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భక్తిగీతాలు, వేద పారాయణాలతో తెల్లవారే తిరుమలలో శీతల సోయగాలు కనువిందు చేస్తున్నాయి. నివర్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఏడుకొండలు ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అంతటా మంచు దుప్పటి కప్పుకోగా మసక వాతావరణంలోనే భక్తులు, సిబ్బంది కార్యకలాపాలు కొనసాగించారు. శ్రీవారి ఆలయం, పరిసరాలు సహా రహదారుల్లో కమ్ముకున్న మంచు దుప్పటి.. చూపరుల మనసును దోచుకుంది. మరోవైపు పది అడుగుల దూరం కూడా కనిపించనంత దట్టంగా మంచుకురిసి కనుమ దారుల్లో లైట్లు వేస్తే తప్ప యాత్రికులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని