సుశాంత్‌ మృతి కేసుపై సోదరి ట్వీట్‌

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి త్వరలో నిజాలు వెల్లడి కావాలని అందరూ ప్రార్థనలు చేయమని తన సోదరి శ్వేతా సింగ్‌ కీర్తి ట్విటర్‌ వేదికగా కోరారు. దీంతో పాటు ‘కళ్లన్నీ సీబీఐ పైనే’ అని హ్యష్‌టాగ్‌ను

Published : 04 Oct 2020 22:13 IST

పట్నా: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి త్వరలో నిజాలు వెల్లడి కావాలని అందరూ ప్రార్థనలు చేయమని అతని సోదరి శ్వేతా సింగ్‌ కీర్తి ట్విటర్‌ వేదికగా కోరారు. దీంతో పాటు ‘కళ్లన్నీ సీబీఐ పైనే’ అని హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. పరీక్షా సమయంలో మనం దృఢంగా ఉన్నామో లేదో దేవుడిపై మనకు ఉన్న విశ్వాసానికి పరీక్ష అని ఆమె పేర్కొన్నారు. సుశాంత్‌ సింగ్‌ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుశాంత్‌ను ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో సీబీఐ అధికారులు ఎయిమ్స్ ఫోరెన్సిక్‌ బృందాన్ని సంప్రదించింది.  ఇందులో హత్య కోణం లేదని ఎయిమ్స్‌ బృందం తేల్చింది. దీనికి సంబంధించి తుది నివేదికను వైద్యులు గత నెల 29న సీబీఐ అధికారులకు అందజేశారు. ఈ కేసులో హీరో హత్య జరిగిందనడానికి అవకాశం లేదని ఎయిమ్స్‌ వైద్యులు తేల్చిన నేపథ్యంలో ఆత్మహత్య కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. హత్యకు ఎవరైనా ప్రేరేపించారా?అనే కోణంలోనూ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సోదరి చేసిన ఈ ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. జులై 14న ముంబయిలోని తన నివాసంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని