
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
1. MAA Elections: మన సంస్థను మనం నడుపుకోలేమా?బయటవాళ్లే కావాలా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల వివాదం రోజురోజుకీ ముదురుతోంది. అధ్యక్ష పదవి కోసం ప్రధాన పోటీదారులుగా ఉన్న మంచు విష్ణు - ప్రకాశ్‌రాజ్‌ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. పలువురు నటీనటులు ‘మా’ అధ్యక్షుడిగా బయటివాళ్లను ఎందుకు ఎన్నుకోవాలి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు, దర్శకుడు రవిబాబు ‘మా’ ఎన్నికలపై పెదవి విప్పారు. లోకల్, నాన్‌లోకల్ వ్యవహారం గురించి తాను స్పందించాలనుకోవడం లేదంటూనే అధ్యక్ష పదవికి బయటవాళ్లను ఎందుకు ఎన్నుకోవాలంటూ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. WHO: కరోనా ముగిసిపోయిందని నటిస్తున్నారు..!
కరోనా మహమ్మారి ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, కానీ దాన్నుంచి ఇంకా బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత వారం 31 లక్షల మందికి కరోనా సోకిందని, 54 వేల మరణాల సంభవించాయని వెల్లడించింది. వాస్తవంగా ఆ లెక్కలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* India Corona: రెండో రోజూ 20 వేల దిగువనే కేసులు
3. Telugu Akademi Scam: తెలుగు అకాడమీ కుంభకోణంలో దర్యాప్తులో పురోగతి
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్ సహా మోసానికి పాల్పడిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా, మరో నలుగురు ఏజెంట్లు వెంకట్, రాజ్‌కుమార్, సాయి, సోమశేఖర్ అనే వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది వరకే అరెస్టు చేసిన యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌ను రిమాండ్‌లో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Gas Cylinder Price: మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర.. పెట్రోలూ పైపైకే..
వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ వంట గ్యాస్ సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. రాయితీ, రాయితీయేతర ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.15 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెంచిన ధరను నేటి నుంచే అమలు చేస్తున్నట్లు వెల్లడించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో 14.2కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.899.50కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Taiwan: తైవాన్ ఆక్రమణ దిశగా చైనా అడుగులు..?
5. Results : ఏపీ ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదల
ఏపీ ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒంగోలులో విడుదల చేశారు. మొదటి ర్యాంకు మద్దాన గుణశేఖర్(ధర్మవరం-అనంతపురం జిల్లా), రెండో ర్యాంకు-కె.శ్రీచక్రధరణి(మైదుకూరు-కడప జిల్లా), మూడో ర్యాంకు-ఎం. చంద్రిక(విజయనగరం) సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Rahul Gandhi: లఖింపుర్ వెళ్తున్నాం.. అరెస్టులు, దాడులకు భయపడం..
అన్నదాతలను కేంద్రం తీవ్రంగా అవమానిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులపై వరుస దాడులు జరుగుతున్నాయని, వారి సమస్యలపై ప్రశ్నిస్తున్న తమని కూడా అడ్డుకుంటున్నారని అన్నారు. దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అయినప్పటికీ తాము భయపడేది లేదని, లఖింపూర్ ఖేరికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. SBI Gold Deposit: ఎస్‌బీఐ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ 3 రకాలు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పునరుద్ధరించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (ఆర్-జీడీఎస్) 3 రకాల డిపాజిట్ పథకాలను అందిస్తుంది. ఎస్‌బీఐ కస్టమర్లు తమ దగ్గరున్న ఉపయోగం లేని బంగారాన్ని `ఆర్-జీడీఎస్` కింద డిపాజిట్ చేయవచ్చు. ఇది వారికి భద్రత, వడ్డీ ఆదాయాలు అందిస్తుంది. ఎస్‌బీఐ ప్రకారం, పునరుద్దరించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (ఆర్-జీడీఎస్) బంగారంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్వభావం కలిగి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* చదువుల కోసం చేసే ఖర్చుపై పన్ను ప్రయోజనాలు తెలుసా?
8. NEET: ఈ ఏడాది పాత విధానంలో నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష..
ఈ ఏడాది నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షను పాత విధానంలోనే నిర్వహిస్తామని, వచ్చే విద్యా సంవత్సరంలో మార్పులు ఉంటాయని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడంతో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. సవరించిన సిలబస్, కొత్త విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. IPL 2021: మేం ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది: రోహిత్ శర్మ
ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ రెచ్చిపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రన్‌రేట్‌ని కూడా మెరుగుపరుచుకుంది. కౌల్టర్‌నైల్ (4/14), నీషమ్ (3/12), బుమ్రా (2/12) సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని హడలెత్తించారు. దీంతో రాజస్థాన్ 9 వికెట్లకు 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ( 50 నాటౌట్; 25 బంతుల్లో 5×4, 3×6) చెలరేగి ఆడటంతో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. Venkatesh: చైసామ్ నిర్ణయం.. పెదవి విప్పే ముందు ఆలోచించాలి
ఇకపై భార్యాభర్తలుగా కలిసి ఉండటం లేదంటూ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు నాగచైతన్య-సమంత జోడీ. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా నటుడు వెంకటేశ్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Mohan babu: మా స్కూల్‌లో చదివిన అమ్మాయి ఇప్పుడు టాప్ హీరోయిన్