Amaravati: చర్చలు మరోసారి విఫలం.. ఎస్మాకు భయపడం: అంగన్వాడీలు

అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయి.

Updated : 12 Jan 2024 22:14 IST

అమరావతి: అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని కమిటీ.. అంగన్వాడీ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. ప్రస్తుతం వేతనాలు పెంచడం సాధ్యం కాదని.. వచ్చే ప్రభుత్వంలో పెంచుతామని కమిటీ తెలిపింది. వారు కోరుతున్న మొత్తం కంటే ఎక్కువే పెంచుతామని హామీ ఇచ్చింది. అలాంటప్పుడు చర్చలకు ఎందుకు పిలిచారని కమిటీ సభ్యులను అంగన్వాడీ నేతలు నిలదీశారు. వేతనాల పెంపుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలా ఇస్తేనే సమ్మె విరమించేందుకు అవకాశం ఉందని అంగన్వాడీ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

భేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ.. ‘‘అంగన్వాడీల 11 డిమాండ్లలో పదింటిని ఆమోదించాం. వేతనాల పెంపుపైనే ప్రధాన సమస్య ఉంది. వారి సమస్యలపై సానుకూలంగానే ఉండాలని సీఎం చెప్పారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు, హెల్పర్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ను రూ.50వేలకు పెంచుతాం. వేతనాల పెంపుపై ఒక విధానం ఉంది. ఐదేళ్లకు ఒకసారి మాత్రమే పెంచాల్సి ఉంటుంది.

సమ్మె యథాతథంగా కొనసాగుతుందని చర్చల అనంతరం అంగన్వాడీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ‘‘మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి సానుకూల దృక్పథం లేదు. అనేకసార్లు చర్చించినా మా డిమాండ్లు నెరవేర్చలేదు. ఎస్మాకు భయపడేది లేదు. కొత్తవారిని నియమించుకుంటామన్న బెదిరింపులకు భయపడం. ఎస్మా ప్రతులను భోగి మంటల్లో కాలుస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది జులై నాటికి ఐదేళ్లు పూర్తవుతాయి. అందుకే వేతనాలను వచ్చే జులైలో తప్పక పెంచుతామని హామీ ఇచ్చాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు