Parrot: ‘ఆ చిలుక నన్ను తెగ ఇబ్బంది పెడుతోంది’.. పోలీసులకు వృద్ధుడి ఫిర్యాదు

పొరుగింట్లో పెంచుకుంటున్న ఓ చిలుక తనను తెగ ఇబ్బంది పెడుతోందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.........

Published : 08 Aug 2022 02:23 IST

పుణె: పొరుగింట్లో పెంచుకుంటున్న ఓ చిలుక తనను తెగ ఇబ్బంది పెడుతోందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అరుపులు, కీచులాటతో నిద్రలేకుండా చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర పుణెలోని శివాజీనగర్ ప్రాంతంలో నివసించే అక్బర్‌ అజ్మెర్‌ ఖాన్‌ తన ఇంట్లో చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే, దాని కీచులాట పొరుగింట్లో ఉండే సురేశ్‌ శిందే (72)ను తెగ ఇబ్బంది పెట్టిందట. దాని గోలకు సరిగా నిద్రపట్టడంలేదని, ప్రశాంతత లేకుండా పోతోందని అతడు తాజాగా ఖడ్కీ పోలీసులను ఆశ్రయించాడు.

వృద్ధుడి ఫిర్యాదుపై ఖడ్కీ పోలీసుస్టేషన్‌ అధికారి స్పందించారు. చిలుక ద్వారా ప్రశాంతతకు భంగం కలుగుతోందంటూ ఓ ఫిర్యాదు అందింది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని