తుది ప్రకటన రాలేదు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం: ఏపీ హైకోర్టు

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ

Published : 14 Mar 2022 11:53 IST

అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. జిల్లాల పెంపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఆర్టికల్‌ 371(డి)కి విరుద్ధంగా ఉన్నాయంటూ విజయ్‌కుమార్‌ (గుంటూరు), సిద్దార్థ(శ్రీకాకుళం) రామారావు (ప్రకాశం) వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త జిల్లాలపై తుది ప్రకటన రానందున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని