అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం గుంటూరు రమేశ్‌ ఆసుపత్రిలో ఆయన చికిత్స

Updated : 29 Jul 2020 18:55 IST

అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈఎస్‌ఐ కేసులో దాఖలైన అన్ని బెయిల్‌ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈఎస్‌ఐ స్కాంలో నిందితులుగా ఉన్న రమేశ్‌ కుమార్‌, మురళి, సుబ్బారావు బెయిల్‌ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం గుంటూరు రమేశ్‌ ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై గత నెల 12న ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని