
Bathukamma: విశ్వవేదికపై తెలంగాణ పండుగ ‘బతుకమ్మ’ వైభవం
దుబాయ్: విశ్వవేదికపై బతుకమ్మ సంబరం అంబరాన్నంటింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై శనివారం రాత్రి తెలంగాణ పండుగ ‘బతుకమ్మ’ వైభవం వీడియో ప్రదర్శించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతి తెలిపేలా ఈ వీడియో రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద తెర బుర్జ్ ఖలీఫా. ఒకేసారి లక్షమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. బతుకమ్మతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటం కూడా ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎంపీ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కవిత ఈ సందర్భంగా తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.