Telangana News: మెడికల్‌ హబ్‌గా తెలంగాణ: భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల

ఎన్నో వ్యాధులకు భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్లు తీసుకొచ్చిందని.. ఇతరుల కంటే ముందుగానే వ్యాక్సిన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ఛైర్మన్‌

Updated : 02 Mar 2022 15:10 IST

హైదరాబాద్‌: ఎన్నో వ్యాధులకు భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్లు తీసుకొచ్చిందని.. ఇతరుల కంటే ముందుగానే వ్యాక్సిన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. అనేక దేశాలకు సరైన సమయంలో కరోనా వ్యాక్సిన్లు అందజేశామని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సీఐఐ తెలంగాణ’ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తెలంగాణ మెడికల్‌ హబ్‌గా మారిందని.. వ్యాక్సిన్ల ఉత్పత్తికి రాష్ట్రంలో అన్ని వసతులూ ఉన్నాయని చెప్పారు. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నామన్నారు. పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని చెప్పారు. ప్రపంచం మొత్తానికి ఆహారం అందించే శక్తి భారత్‌కు ఉందని.. మన వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని డాక్టర్‌ కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని