
AP capital issue: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం వివరణ
ఇంటర్నెట్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. జులై 26న ఏపీ రాజధాని విశాఖ అని అర్థం వచ్చేలా లోక్‌సభలో కేంద్రం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. విశాఖ ఏపీ రాజధాని అని చెప్పడం మా ఉద్దేశం కాదని కేంద్రం తెలిపింది. ‘విశాఖ ఏపీ రాజధాని కాదు.. రాష్ట్రంలో నగరం మాత్రమేనని, పెట్రో పన్నుల విషయంలో విశాఖను ఉదాహరణగా తీసుకున్నట్లు’ కేంద్రం పేర్కొంది. అంబాలా, లుథియానా నగరాలను సైతం ఉదాహరణగా తీసుకున్నట్లు తెలిపింది. అంబాలా, లుథియానా నగరాలు ఆయా రాష్ట్రాల్లో రాజధానులు కావని కేంద్రం వివరణ ఇచ్చింది. టైటిల్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం పేర్కొంది. హెడ్డింగ్‌లో జరిగిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుతున్నామని తెలిపింది. రాజధానితో పాటు సమాచారం సేకరించిన నగరంగా పేరు చేర్చుతున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ సచివాలయానికి కూడా ఈ సమాచారం ఇచ్చామని కేంద్రం చెప్పింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.