Parliament: తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు: కేంద్రం

తెలంగాణ (Telangana)లో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్‌ (Dharmendra pradhan) వెల్లడించారు. ఈ మేరకు తెరాస ఎంపీ బీబీ బాటిల్‌లోపాటు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Published : 06 Feb 2023 16:42 IST

దిల్లీ: దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులు (Tribal Students) ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం రెండు గిరిజన విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెప్పిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh)లోని విజయనగరం జిల్లాలో ఒకటి, మధ్యప్రదేశ్‌లో మరొకటి ఉన్నాయని వెల్లడించింది. ఈ రెండు యూనివర్సిటీల్లో 523 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు కేంద్ర విద్యాశాఖ లోక్‌సభ (Lok Sabha)లో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాద ఉందన్న కేంద్రం..విశ్వవిద్యాలయాల ఏర్పాటు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పేర్కొంది. అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. గిరిజిన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణీత ప్రమాణాలేవీ లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు భారాస ఎంపీ బీబీ పాటిల్‌ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

మూడో రోజూ స్తంభించిన ఉభయసభలు

అదానీ వ్యవహారంపై ఇండియన్‌ బంక్‌ విడుదల చేసిన నివేదికపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో ఎగువసభ కూడా రేపటికి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని