TS Eamcet: తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలివే!

మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

Updated : 31 Mar 2023 17:27 IST

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష(TS EAMCET) షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్‌.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. మే 7న నీట్‌ (యూజీ) పరీక్ష,  మే 7, 8, 9 తేదీల్లో  టీఎస్‌పీఎస్సీ పరీక్షలు  ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు  పేర్కొన్నారు. ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఎంసెట్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 4తో ముగియ నుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఇంకోవైపు, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌)కు గురువారం సాయంత్రం వరకు 1,14,989మంది దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌కు 65,033 మంది, రెండింటికీ 218 మంది విద్యార్థులు చొప్పున మొత్తంగా 1,80,240మంది  దరఖాస్తు చేసుకున్నారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని