Hyderabad: 466 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

అత్యవసర సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 466 అంబులెన్స్‌లను పీపుల్స్‌ ప్లాజాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Updated : 01 Aug 2023 14:07 IST

హైదరాబాద్: అత్యవసర సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 466 అంబులెన్స్‌లను పీపుల్స్‌ ప్లాజాలో సీఎం కేసీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 108 అంబులెన్స్‌లు 204 ఉండగా.. అమ్మఒడి వాహనాలు 228, పార్థివదేహాలను తరలించే వాహనాలు 34 ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ శాంతికుమారి, ఇతర వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి సీఎం ఈ వాహనాలు ప్రారంభించడంతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

ఇతర రాష్ట్రాల్లో స్కామ్‌లు.. తెలంగాణలో స్కీమ్‌లు..: హరీశ్‌రావు

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో స్కామ్‌లు ఉంటే.. తెలంగాణలో స్కీమ్‌లు ఉన్నాయి. కుటుంబ పెద్దగా కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. రాష్ట్రం రాక ముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగేవి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. ఆశావర్కర్లకు సెల్‌ఫోన్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. వారికి స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాల పెంపు ఉంటుంది’’ అని హరీశ్‌రావు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని