Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Apr 2024 09:14 IST

1. బెట్టింగ్‌ భూతం.. దా‘రుణాలు’ అనంతం

బెట్టింగ్‌ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి రూ.వందలతో మొదలయ్యే పందేలు.. రూ.లక్షల వరకూ వెళుతున్నాయి. పెట్టిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము వస్తుందనే ఆశతో అడ్డగోలుగా అప్పులు చేస్తూ నేరాల బాట పడుతున్నారు. పూర్తి కథనం

2. అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద

వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్‌, బైజూస్‌ అంటూ జగన్‌ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ విద్యార్థులను చెట్ల కిందకు నెట్టారు. పిల్లలకు మేనమామగా ఉంటానంటూ అతీగతీ లేని ‘నాడు-నేడు’ పనులతో అన్నం పెట్టే చదువులకు చెదలు పట్టించారు.పూర్తి కథనం

3. రాజాసింగ్‌.. రాస్తా అలగ్‌: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే

ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కొద్దిమంది నేతలు ఆయనకు చెప్పినా అబ్బే...నా దారి ఇంతే అంటున్నారు. ఆయన ఎవరో కాదు...గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌.పూర్తి కథనం

4. డీఎస్సీ వేయలే.. ఒక్క టీచర్‌ ఉద్యోగమూ ఇవ్వలే!

వైకాపా అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్‌ పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వకపోగా పాఠశాలల విలీనం పేరుతో టీచర్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు తీసుకెళ్లి వారిపై విపరీతంగా పనిభారం పెంచేసి ఉపాధ్యాయుల నడ్డివిరిచారు. ఆయన చెప్పిన ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో డబుల్‌ టీచర్లను నియమించింది లేదు.పూర్తి కథనం

5. నిగూఢ సైన్యం!

సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలకు, నేతలకు నిరుద్యోగ ఇంజినీర్లు, ఎంబీఏ పట్టభద్రులు నిగూఢ సైన్యంగా పని చేస్తున్నారు. తమ డేటా నైపుణ్యాలతో అతి తక్కువ సమయంలో నేతల ప్రచారంలోని రాజకీయ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇందులో ఐఐటియన్లు, ఎంబీఏ పట్టభద్రులు, యువ న్యాయవాదులు తెర వెనుక ప్రచార వ్యూహాల్లో పాలు పంచుకుంటున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాలయాల నుంచి పట్టాలు అందుకున్న పలువురు యువత ఈ క్రతువులో పాల్గొంటున్నారు. పూర్తి కథనం

6. సీఎం రాగానే.. జనం జారుకున్నారు

తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. అందులోనూ విషయం లేకపోవడంతో సభకు హాజరైన వైకాపా కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. ప్రసంగం పేలవంగా మొదలుపెట్టడంతో సభకు వచ్చిన జనం మొదట్లోనే జారుకున్నారు.పూర్తి కథనం

7. పెద్దపులులకు నీటి కష్టాలు!

మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. ఈ పరిస్థితిలో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు అటవీ శాఖ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది.పూర్తి కథనం

8. అరగంట కరెంట్‌ కట్‌.. కీసర డీఈపై సస్పెన్షన్‌ వేటు

అరగంట కరెంట్‌ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్‌లోని హబ్సిగూడ సర్కిల్‌ కీసర డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) ఎల్‌.భాస్కర్‌రావును దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్‌ చేశారు. నాగారం ఆపరేషన్‌ అడిషనల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈఈ)పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పూర్తి కథనం

9. భువనగిరి బరిలో కొనసాగనున్న సీపీఎం

భువనగిరి లోక్‌సభ స్థానంలో పోటీలో కొనసాగాలని సీపీఎం నిర్ణయించింది. రాష్ట్రంలోని మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనుంది. ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకుంది. సీపీఎం నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం జరిపిన చర్చల్లో భువనగిరిలోనూ కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను సీపీఎం రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి ఆదివారం ఉదయం తీసుకెళ్లారు. ఆ తర్వాత ముఖ్యనాయకులు చర్చించుకున్నారు. పూర్తి కథనం

10. ఐపీఎల్‌ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు

ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్‌ బయటకొస్తాడు.. స్టాన్స్‌ ఎలా తీసుకోవాలి..ఫుట్‌వర్క్‌ ఎలా ఉండాలి..డ్రైవ్‌ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం కూడా క్రీడలేనంటూ చెప్పుకొస్తారు. అయితే అయిదేళ్ల పాలనలో చిల్లిగవ్వ ఇవ్వకుండా అన్నీ చేసేశానని అబద్ధాలను ఆశువుగా పలికేస్తారని జిల్లాలోని క్రీడాభిమానులు  పెదవి విరుస్తున్నారు. పీఈటీలను తొలగించేసి.. క్రీడా వసతులు నిలిపేసి తమ వెన్ను విరిచారని వారు వాపోతున్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని