CM KCR: చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది.. ఇదే పట్టుదలతో ముందుకు సాగుదాం: కేసీఆర్
జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో రూ.56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
నిర్మల్: జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో రూ.56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాలోనే నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. అసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లే ఇది సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే మరో 50ఏళ్లు గడిచినా ఇలాంటి అభివృద్ధి జరిగేది కాదు. దేశంలో తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది. జిల్లాకు చెందిన ముక్కుర.కె గ్రామానికి చాలా అవార్డులు వచ్చాయి.
తరతరాలుగా అణచివేయబడుతున్న దళితులు, గిరిజనులు, అగ్ర వర్ణాల్లో పేదలు వెనుకబడి ఉన్నారు. ఇదే పట్టుదల, కృషితో ముందుకు సాగితే అందరినీ సమాన స్థాయికి తెచ్చే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. పోడు భూముల పంపిణీ చక్కగా నిర్వహించాలని కలెక్టర్‌కు సూచిస్తున్నా. ఈ ఏడాది నుంచే పోడు భూముల రైతులకు ‘రైతు బంధు’ అమలు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు