Diabetes: మధుమేహమా.. ఉదయాన్నే పరగడుపున ఇలా చేయండి!

మారుతున్న జీవన శైలితో మధుమేహం(Diabetes) బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. రక్తంలో అధిక చక్కెరస్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మేలు.

Updated : 11 Apr 2023 08:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధునిక కాలంలో మానవాళిని పట్టిపీడిస్తోన్న అతిపెద్ద సమస్య మధుమేహం(diabetes). దీనిబారిన పడ్డామంటే ఇక అంతే.  సర్వం కోల్పోయామన్న భావన ఏర్పడుతుంది. ఆహారం నుంచి రోజువారీ అలవాట్లను సైతం మార్చుకోక తప్పదు. ఎలాపడితే అలా తినడానికి ఇక బ్రేకులు పడినట్టే. శరీరంలో చక్కెర మోతాదులను నియంత్రణలో ఉంచుకొనేందుకు తరచూ మందులు వాడటంతో పాటు అల్పాహారం తీసుకోవడంలోనూ అనేక జాగ్రత్తలు పాటించాల్సిందే. అయితే, ఉదయాన్నే పరగడుపున కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడంలో దోహదపడతాయనంటున్నారు నిపుణులు. మరి, అవేంటో చూద్దామా!

  • మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే తక్కువ మొత్తంలో ప్రోటీన్‌ను తీసుకోవచ్చు. అందుకుగాను నానబెట్టిన బాదం, వాల్‌నట్‌ వంటి డ్రైఫ్రూట్స్‌ తినడం మేలు చేస్తుంది. 
  • సుగంధ ద్రవ్యాల్లో ప్రముఖంగా వాడే దాల్చిన చెక్క మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు దోహదపడుతుంది. దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా చేసి రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగినా సరే.. లేదంటే హెర్బల్‌ టీని తయారు చేసుకొనేందుకు సైతం ఈ నీటిని ఉపయోగించవచ్చు. నానబెట్టిన దాల్చిన చెక్కల్ని తినవచ్చు. దీంతో రోజంతా శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రించవచ్చు.
  • అలాగే, ఒక టేబుల్ స్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, 30 ml ఉసిరి/నిమ్మ రసం, 100 ml నీటిలో కలిపి తాగడం ద్వారా మీ శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతుంది. 
  • దీనికితోడు, ఉదయాన్నే ఒక చెంచా మెంతి గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. ఇందుకోసం మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానటెబ్టుకోవాలి. ఉదయాన్నే ఈ గింజలను తినడంతో పాటు ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. దయచేసి తరచూ వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని