Bharat Biotech: కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసుతో మెరుగైన ఫలితాలు: భారత్‌ బయోటెక్‌

రెండో డోసు తీసుకున్న ఆరు నెలలకు కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.

Updated : 08 Jan 2022 19:31 IST

హైదరాబాద్‌: రెండో డోసు తీసుకున్న ఆరు నెలలకు కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. రెండో డోసు తీసుకున్న వారితో పోలిస్తే బూస్టర్‌ డోసు తీసుకున్న వారిలో డెల్టాని నిలువరించే యాంటీబాడీల వృద్ధి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. బూస్టర్‌ డోసుపై చేసిన ప్రయోగాలకు సంబంధించి వివరాలను శనివారం విడుదల చేసింది. 90 శాతం మందిలో తీవ్రమైన కొవిడ్‌ స్ట్రెయిన్‌లను సైతం నిలువరించే శక్తిగల యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. బూస్టర్‌ డోసు తీసుకున్నవారిలో టి, బి సెల్‌ రెస్పాన్స్‌ గుర్తించామని తెలిపింది. బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం పాటు తీవ్ర కొవిడ్‌ నుంచి రక్షణ పొందొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని