ఉప్పల్‌ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు.. స్వల్ప ఉద్రిక్తత

ఐపీఎల్‌ -17వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌-చెన్నై మ్యాచ్‌ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివస్తున్నారు.

Published : 05 Apr 2024 18:00 IST

హైదరాబాద్‌: ఉప్పల్‌ క్రికెట్‌ మైదానం పరిసరాల్లో సందడి నెలకొంది. ఐపీఎల్‌ -17 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌-చెన్నై మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. రాత్రి 7.30కి మ్యాచ్‌ ప్రారంభం కానుండగా.. ఇప్పటినుంచే టికెట్లు ఉన్నవారిని తనిఖీ చేసి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. మ్యాచ్‌ నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి అదనంగా గంటపాటు మెట్రో రైళ్లు నడవనున్నాయి. మరోవైపు ఉప్పల్‌ మైదానానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చెన్నై జట్టు అభిమానులతో స్టేడియం పసుపుమయంగా మారింది. ఆ జట్టు జెర్సీలు ధరించి అభిమానులు భారీగా తరలివస్తున్నారు.  

ఇదిలాఉండగా.. ఉప్పల్‌ స్టేడియం గేట్‌ నెంబర్‌-4 వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. టికెట్లు ఉన్నా లోపలికి పంపడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బారీకేడ్లను తోసేశారు. ఈక్రమంలో పోలీసులకు, క్రికెట్‌ ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని