Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (01/04/22)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 01 Apr 2022 04:41 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనుల్లో చిత్తశుద్ది అవసరం. పూర్వపుణ్యం రక్షిస్తోంది. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

ముందస్తు ప్రణాళికలతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో అనూహ్య లాభం పొందుతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది.

ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

అనుకూలమైన సమయం. మిత్రులు,బంధువులు మీ మాటకు విలువ ఇస్తారు. మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.  

అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.

మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమామహేశ్వర స్తోత్రం చదివితే మంచిది.

కష్టానికి తగ్గ ప్రతిఫలం  ఉంటుంది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఖర్చులు చేయిదాటకుండా చూసుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కనకదుర్గాదేవి దర్శనం శుభప్రదం.

 

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.

మిత్రుల సహకారం ఉంటుంది. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. బద్దకాన్ని దరిచేరనీయకండి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.  

సందర్భోచిత నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. గోవిందనామాలు చదవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని