Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/09/22)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 02 Sep 2022 04:04 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.

మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే శుభం జరుగుతుంది.

కృషికి తగిన ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభదాయకం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవము పఠించాలి.

అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.

లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి.  కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పని చేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. దుర్గా ధ్యానం ఉత్తమం. 

ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకుసాగితే అన్ని సర్దుకుంటాయి. సూర్యారాధన శుభదాయకం. 

మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదివితే మంచిది.

 

అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. గిట్టనివారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

శ్రద్ధతో పనిచేయాలి. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. బంధువులతో మాట పట్టింపులకు పోరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సూర్య స్తుతి శక్తినిస్తుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని