Updated : 05 Apr 2022 05:14 IST

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05-04-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మీ మీ రంగాల్లో  ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవధ్యానం శుభప్రదం. 

మీ మీ రంగాల్లో  మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

స్వల్ప ప్రయత్నంతోనే  గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి  సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.  శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిశ్రమకాలం. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి జరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి.

వృత్తి,ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో పరిరక్షణ అవసరం. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. మానసిక ప్రశాంతత కోసం వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం మేలు చేస్తుంది.

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

 

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగకండి. శ్రీఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వల్ల సంతోషంగా ఉంటారు. దుర్గాస్తుతి చదవాలి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని