Published : 20 Nov 2021 05:55 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20-11-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శారీరక శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. సమయాన్ని వృథా చేయకండి. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే  మేలు జరుగుతుంది.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అధికారుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

వృత్తి, ఉద్యోగాల్లో, శ్రద్ద తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. భయాందోళనలు విడనాడాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది.

మీలోని నైపుణ్యంతో గొప్ప పేరు సంపాదిస్తారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్థలాభం ఉంది. ఈశ్వర దర్శనం మంచిది.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

మిశ్రమకాలం. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దేహజాఢ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి ఉంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని చేకూరుస్తుంది.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శివ నామాన్ని జపించండి.

 

ప్రారంభించే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.

ప్రారంభించబోయే పనుల్లో రెండు ఆలోచనలతో వెళ్లకండి. గిట్టని వారికి దూరంగా ఉండాలి. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఇష్టదైవాన్ని పూజించాలి.

శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని