ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-03-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-03-2022)

Updated : 26 Mar 2022 03:26 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు ఉన్నాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రాహు శ్లోకాన్ని చదువుకోవడం మంచిది.

 ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ విభేదించకండి. మాట విలువను కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది.

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి  సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

అర్థలాభం ఉంది. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.

మిశ్రమకాలం. మీ మీ  రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

విజయసిద్ధి కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి  పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో  మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది.

ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. చక్కటి  ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శివ నామ స్మరణ మంచిది.

శుభకాలం. అనుకున్న  పనులను పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక,సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని శ్లోకాన్ని చదివితే మంచిది.
 
 

మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. అష్టలక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.
 

ఇష్టమైన వారితో  కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దైవబలం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతా దర్శనం శుభకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని