ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. పెట్రోల్‌పై రూ. 1,24, డీజిల్‌పై 93 పైసలు వ్యాట్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వ్యాట్‌ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెట్రోల్‌పై 31

Published : 20 Jul 2020 20:12 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. పెట్రోల్‌పై రూ. 1.24, డీజిల్‌పై 93 పైసలు వ్యాట్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వ్యాట్‌ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనపు సుంకం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు రూ. 4 అదనంగా సుంకం విధించింది. కొవిడ్‌ వల్ల ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ. 4,480 కోట్ల మేర రావాల్సిన రెవెన్యూ తగ్గిందని రెవెన్యూశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రూ. 1,323 కోట్లు మాత్రమే రెవెన్యూ వచ్చిందని తెలిపింది. ప్రస్తుత వ్యాట్‌ పెంపు 2015-18 మధ్య వసూలు ప్రకారమే ఉందని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని