Tirumala: తితిదే విజిలెన్స్‌ అదుపులో నకిలీ ఐఏఎస్‌ అధికారి

తిరుమలలో నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 11 Apr 2024 11:52 IST

తిరుమల: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని