Telangana News: తెలంగాణలో పలుచోట్ల 126 మంది విద్యార్థులకు అస్వస్థత

తెలంగాణలో ఇవాళ పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వీరికి వాంతులు, విరోచనాలయ్యాయి. ఆదిలాబాద్‌

Updated : 09 Mar 2022 23:43 IST

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వీరికి వాంతులు, విరోచనాలయ్యాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని తాంసి మండలం గోట్కూరి ప్రాథమిక పాఠశాలలో మరో 28 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, డీఈవో ప్రణీత ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అడ్డాకుల మండలం పెద్దమునగాలచేడు పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు.  జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, డీఎంహెచ్‌వో పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, వారి ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోనూ 38 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని