Foxconn: తెలంగాణలో ‘ఫాక్స్‌కాన్‌’ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం: ఛైర్మన్‌ యాంగ్‌ లియూ

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తైవాన్‌ పర్యటనకు రావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ మేరకు ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యాంగ్ ల్యూ లేఖ రాశారు.

Updated : 06 Mar 2023 15:22 IST

హైదరాబాద్‌: తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఫాక్స్‌కాన్ (Foxconn Chairman) సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్ యాంగ్ లియూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనకు, తన బృందానికి మంచి ఆతిథ్యం ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత గ్రీటింగ్ కార్డుతో తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలు, ప్రణాళికలు తనలో స్ఫూర్తి నింపాయన్న యాంగ్ లియూ.. భారతదేశంలో తనకు కొత్త స్నేహితుడు లభించాడని, భవిష్యత్‌లో తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీన సమావేశంలో చెప్పినట్లుగా.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తయారీకేంద్రం ఏర్పాటుకు ఫాక్స్ కాన్ కట్టుబడి ఉందని లేఖలో స్పష్టం చేశారు. కొంగరకలాన్ పార్కులో కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేలా తమ బృందానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. తైవాన్‌(Taiwan)లో పర్యటించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యాంగ్‌ లియూ ఆహ్వానించారు. తైపీలో ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో గౌరవంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని