Telangana news: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఉచిత ఎంసెట్‌ కోచింగ్‌

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.

Published : 06 Dec 2022 01:05 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. డిసెంబరులో ఇంటర్ సిలబస్ పూర్తి చేసి.. జనవరి, ఫిబ్రవరిలో కళాశాలల్లోనే శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో గ్రూప్ వారీగా 50 మంది బాలురు, 50 మంది బాలికలను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కూడా అందిస్తారు. మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాధికారులు ప్రిన్సిపల్స్‌, సిబ్బంది, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి ఉచిత కోచింగ్‌కు సన్నద్ధం చేయాలని నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని